Kodumuru: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోడుమూరు తహశీల్దార్‌కు వినతి!

Kodumuru: కోడుమూరులో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ నాగరాజుకు వినతిపత్రం. ఇళ్ల స్థలాలు, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్.

C. Ganesh, Kodumuru
Published on: 12 Oct 2026 12:48 PM IST
Kodumuru
X

Kodumuru: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోడుమూరు తహశీల్దార్‌కు వినతి!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం చెయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కోడుమూరు తాలుకా కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ నాగరాజు కి జర్నలిస్టులకు వినతి పత్రం ఇచ్చారు.

గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసి, ఇంటి స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణానికి కూడా అవకాశం కల్పించాలని కోరారు.

మరోవైపు జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం, వారిని వేధింపులకు గురిచేయడం వంటి చర్యలను అరికట్టాలని కోరారు. జర్నలిస్టులకు విధి నిర్వహణలో తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సినీయర్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి నెలకు 10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో రద్దు చేసిన రైల్వే పాసులను తిరిగి పునరుద్ధరించి జర్నలిస్టులకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.

ఈకార్యక్రమంలో APWJF తాలుకా అధ్యక్షుడు NTV రఘు, కార్యదర్శి సాక్షి హంపి రెడ్డి,యుగంధర్ ,సుమన్ టివి వీరన్న,99 TV రిపోర్ట్ శివ,ఐ న్యూస్ రిపోర్టర్ గిరి పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru