Kurnool: హిందూపూర్‌లో నకిలీ వైద్యులపై ఏపీఎంసీ కమిటీ ఆకస్మిక దాడులు!
Kurnool: హిందూపూర్ పట్టణంలో నకిలీ వైద్యులపై APMC నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యుడు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
Kurnool: హిందూపూర్‌లో నకిలీ వైద్యులపై ఏపీఎంసీ కమిటీ ఆకస్మిక దాడులు!
Kurnool: (నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి గారి) ఆధ్వర్యంలో, హిందూపూర్ పట్టణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పైన దాడులు నిర్వహించడం జరిగింది.
అత్యంత పకడ్బందీగా APMC మరియు NMC మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని నకిలీ వైద్యుల నిరోధానికి అనుసరించవలసిన, అత్యంత ఆచరణ సాధ్యమైన, నిర్దిష్టమైన, సమర్థవంతమైన స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ (SOP) ను సభ్యులందరి సహకారం తో తయారు చేయడం జరిగింది.
ఈ SOP ప్రకారం నకిలీ వైద్యుల పైన దాడులు, తనిఖీలు నిర్వహించి నకిలీ వైద్యుల నిరోధానికి ఏపీ మెడికల్ కౌన్సిల్ ఒక నిర్దిష్టమైన వ్యూహంతో సిద్ధంగా ఉంది. ఈ తనిఖీలలో నాతో పాటు ఏపీఎంసీ విజిలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ఆశ కిరణ్మయి, సిబ్బంది రంజిత్ కుమార్, పాల్గొన్నారు.




