Peddaraveedu: రాజంపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా క్రీడల సంబరం!

Peddaraveedu: పెద్దారవీడు మండలం రాజంపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో మంగళవారం వార్షిక క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. ఠాగూర్ హౌస్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 17 Nov 2026 7:48 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: రాజంపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా క్రీడల సంబరం!

పెద్దారవీడు: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం రాజంపల్లిలో వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు మంగళవారం అట్టహాసంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు.

ఈ కార్యక్రమానికి పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ మహావీర్ సింగ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ప్రముఖ కరాటే మాస్టర్ శ్రీనివాసరావు (7th Dan Black Belt) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

అనంతరం నిర్వహించిన పరుగుపందాలు, లాంగ్ జంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, చెస్ తదితర పోటీల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథి, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ చేతుల మీదుగా పతకాలు, బహుమతులు అందజేశారు.

ఈ ఏడాది నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ఠాగూర్ హౌస్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. దీంతో ఠాగూర్ హౌస్ విద్యార్థులు, హౌస్ ఇన్‌ఛార్జ్‌లు, ఉపాధ్యాయులను పాఠశాల ప్రతినిధులు అభినందించారు.

విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడమే క్రీడా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది సమిష్టి కృషితో వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM