Aluru: ఆలూరులో ఏడాదిలో రూ.250 కోట్ల పనులు: వైకుంఠం జ్యోతి
Aluru: ఆలూరు నియోజకవర్గంలో ఏడాది కాలంలో రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి వెల్లడించారు.
Aluru: ఆలూరులో ఏడాదిలో రూ.250 కోట్ల పనులు: వైకుంఠం జ్యోతి
కర్నూలు జిల్లా: ఆలూరులో అభివృద్ధి పనులపై టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి మీడియా సమావేశం నిర్వహించారు.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో ఆలూరు నియోజకవర్గంలో సుమారు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వేదవతి ప్రాజెక్టు, నగుడోన రిజర్వాయర్ పనులను పునఃప్రారంభి, పరిపాలన అనుమతులు ఇచ్చి దాదాపు 1900 వేల కోట్లు నిధులు ఇచ్చి సహకరించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు...
త్వరలో యువత, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వైకుంఠం జ్యోతి వెల్లడించారు. ఇన్‌చార్జ్‌గా ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హర్షం..
వైకుంఠం జ్యోతి గారికి శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానం.




