Kurnool: ఆదోని ఘటనపై ఆలూరులో భగ్గుమన్న న్యాయవాదుల నిరసన!

Kurnool: ఆదోనిలో సీనియర్ న్యాయవాది వై.ఎం. మల్లికార్జునపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆలూరులో అంబేద్కర్ సర్కిల్ వద్ద న్యాయవాదుల భారీ ఆందోళన.

Bheemalinga, Aluru
Published on: 8 Oct 2026 5:42 PM IST
Kurnool
X

Kurnool: ఆదోని ఘటనపై ఆలూరులో భగ్గుమన్న న్యాయవాదుల నిరసన!

Kurnool: ఆదోని ఘటనపై ఆలూరులో న్యాయవాదుల నిరసన: ఎం. మల్లికార్జునపై దాడిని ఖండించిన ఆలూరు బార్ అసోసియేషన్ ఆదోని టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో సీనియర్ న్యాయవాది వై.ఎం. మల్లికార్జునపై జరిగిన భౌతిక దాడిని నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆలూరులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద గురువారం న్యాయవాదులు భారీ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా ఆలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లాయర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ. ఆదోనిలో లాయర్ పురుషోత్తం రెడ్డి తన క్లైంట్లతో కలిసి సీనియర్ అడ్వకేట్ వై.ఎం. మల్లికార్జునపై దాడికి పాల్పడటం అత్యంత విచారకరమని, ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు తరచూ పెరుగుతున్నాయని, విధుల్లో ఉన్న లాయర్లకు రక్షణ కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయవాదులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించి, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, 'న్యాయవాదుల సంరక్షణ చట్టం' అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆలూరు బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, ప్రముఖ నాయకులు షాకిర్, రాజేష్, విజయరాజ్, రవి, తదితరులు పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru