Alur: టీడీపీకి రెబల్ తాకిడి – జెడ్పీటీసీ బరిలో గోవిందుగౌడ్!
Alur: హొళగుంద జెడ్పీటీసీ స్థానంలో టీడీపీకి రెబల్ అభ్యర్థిగా సీనియర్ నేత గోవిందుగౌడ్ పోటీ. బీఫామ్ పొందిన దర్గన్నకు సవాల్‌గా మారిన పరిణామాలు.
Alur: టీడీపీకి రెబల్ తాకిడి – జెడ్పీటీసీ బరిలో గోవిందుగౌడ్!
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద మండలంలో మాత్రం జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. హొళగుంద మండలంలో టీడీపీ తరఫున ఎలార్తి దర్గన్నకు బీఫామ్ (B-Form) ఇచ్చారు అయితే టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు గోవిందు కూడా జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కూటమి తరఫున బీఫామ్ పొందిన దర్గన్నకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో, గోవిందు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
మరోవైపు, కూటమి ఐక్యతను కాపాడుతూ అధికారికంగా అభ్యర్థిత్వం పొందిన నాయకుల విజయానికి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్ఠానం సూచించారు అయితే జడ్పీటీసీ పోటీ పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే హొళగుంద మండలంలో టీడీపీ సీనియర్ నాయకుడే రెబల్ అభ్యర్థిగా బరిలో నిలవడం పార్టీకి సవాల్‌గా మారే అవకాశముంది. అధికారికంగా బీఫామ్ పొందిన దర్గన్నకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తాయా? లేక సీనియర్ నాయకుడు గోవిందు స్వతంత్ర అభ్యర్థిగా ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ పరిణామాలపై టీడీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది? రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉన్న గోవిందుపై ఎలాంటి చర్యలు ఇ ఏలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతుంది? అన్నది వేచి చూడాలి. హొళగుంద జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి రెబల్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవుతుందా? లేక అధిష్ఠానం జోక్యంతో పరిస్థితులు మారుతాయా? అన్నది ఎన్నికల ఫలితాల వరకు ఉత్కంఠ రేపుతోంది.




