Alur: ఆలూరులో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి విజయ్ ఎన్నికల ప్రచార జోరు

Alur: కర్నూలు జిల్లా ఆలూరు మేజర్ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మెడికల్ షాప్ విజయ్‌కు మద్దతుగా ఎంపీపీ వైకుంఠం శ్రీరామ్, నేతల విస్తృత ఇంటింటి ప్రచారం.

Bheemalinga, Aluru
Published on: 23 Nov 2026 6:16 PM IST
Alur
X

Alur: ఆలూరులో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి విజయ్ ఎన్నికల ప్రచార జోరు

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మెడికల్ షాప్ విజయ్‌కు మద్దతుగా టీడీపీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఎంపీపీ వైకుంఠం శ్రీరామ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొని, అభ్యర్థి మెడికల్ షాప్ విజయ్‌తో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయ్‌కు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలను కలుసుకుంటూ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru