Kurnool: పోలీసు అమరవీరుల స్మారకార్థం రక్తదానం.. ముందుకు వచ్చిన ప్రజలు!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఐ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు.

Bheemalinga, Aluru
Published on: 15 Oct 2026 11:24 AM IST
Kurnool
X

Kurnool: పోలీసు అమరవీరుల స్మారకార్థం రక్తదానం.. ముందుకు వచ్చిన ప్రజలు!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ పోలీసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు రక్తం ఎంతో అవసరమని, రక్తదానం ద్వారా వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన దాతలను ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి అభినందించి, వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ప్రజల ప్రాణాల రక్షణలో విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ, అదే స్ఫూర్తితో తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని పలువురు కొనియాడారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru