Alur: ఆలూరులో పోలీసుల అవగాహన సదస్సు: ఎస్సై విజయ్!

Alur: కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలో ఎస్సై మన్నద విజయ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు, మహిళా భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.

Bheemalinga, Aluru
Published on: 10 Nov 2026 7:46 PM IST
Alur
X

Alur: ఆలూరులో పోలీసుల అవగాహన సదస్సు: ఎస్సై విజయ్!

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని ఓ గ్రామంలో ఆలూరు ఎస్సై మన్నద విజయ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికలు, శాంతిభద్రతలు, మహిళల భద్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు 1098 హెల్ప్‌లైన్, ఈవ్ టీజింగ్, మహిళలపై నేరాల నివారణకు 112, సైబర్ నేరాల బారిన పడినప్పుడు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు వివరించారు. అదేవిధంగా IVRS కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.

గ్రామాల్లో దొంగతనాల నివారణ, రహదారి భద్రతపై కూడా ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ చట్టాలను గౌరవించాలని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై మన్నద విజయ్ కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru