Alur: ఆలూరు సెయింట్ జోసెఫ్ ప్రైవేట్ స్కూల్‌లో ఊడిన పైకప్పు పెచ్చులు!

Alur: కర్నూలు జిల్లా ఆలూరులోని సెయింట్ జోసెఫ్ ప్రైవేట్ స్కూల్‌లో పైకప్పు పెచ్చులు ఊడిపడి నలుగురు విద్యార్థులకు గాయాలు. ఆసుపత్రికి తరలింపు, తల్లిదండ్రుల ఆందోళన.

Bheemalinga, Aluru
Published on: 27 Oct 2026 4:36 PM IST
Alur
X

Alur: ఆలూరు సెయింట్ జోసెఫ్ ప్రైవేట్ స్కూల్‌లో ఊడిన పైకప్పు పెచ్చులు!

Alur: కర్నూలు జిల్లా ఆలూరులోని సెయింట్ జోసెఫ్ ప్రైవేట్ పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల భవనంలోని ఓ గది పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడి విద్యార్థులపై పడటంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనతో పాఠశాలలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

గదిలో ఒకే చోట పైకప్పు పెచ్చులు పెద్ద ఎత్తున ఊడిపడటంతో విద్యార్థులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. గాయపడిన నలుగురు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదకరంగా మారిన తరగతి గదుల్లోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారా?

పాఠశాల భవనం పరిస్థితిపై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైకప్పు పెచ్చులు ఊడిపడే పరిస్థితి ఉంటే ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమ పిల్లలను చదువుల కోసం పాఠశాలకు పంపిస్తే, అక్కడ భద్రత లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలను తనిఖీ చేయాలని, ప్రమాదకరంగా ఉన్న గదులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

విద్యార్థుల ప్రాణాలకు భరోసా ఏది? పాఠశాల భవనాల భద్రతను అధికారులు ఎప్పుడు పరిశీలిస్తారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru