Alur: జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం
Alur: జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామికమని ఆలూరులో ఏపీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Alur: జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు జర్నలిస్టుల పై జరిగిన దాడి అప్రజాస్వామికం అని తీవ్రంగా ఖండిస్తూ ఆలూరు జర్నలిస్టు సంఘాలు, కార్మిక సంఘాలు, వామపక్ష నాయకులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ శోభసువర్ణకు వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఏపిడబ్ల్యూజెఎఫ్ ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి ఎం.క్రిష్ణ మాట్లాడుతూ ఏపిడబ్ల్యూజెఎఫ్ కోడుమూరు తాలూకా అధ్యక్షులు,ఎన్టీవి రిపోర్టర్ రఘు ఆదివారం రాత్రి తన ఇంటికి వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందన్నారు.
కాకినాడ లో భూ ఆక్రమాలపై కథనాలు వ్రాసిన ప్రజాశక్తి విలేకరి రమేష్ పై సోమవారం విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచిన గుండాలను తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు.జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే పి.నారాయణ స్వామి,ఈరన్న,విఠల్,సిపిఎం నాయకులు పి.హనుమంతు,మైన మద్దతు తెలిపారు. జర్నలిస్టులు సాహెబ్ జాన్, ఇస్మాయిల్, చరణ్ పాల్గొన్నారు.




