Kurnool: కర్నూలు జీజీహెచ్‌లో అద్భుతం 45 రోజుల్లో కోలుకున్న యువతి!

Kurnool: కర్నూలు జీజీహెచ్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో కోమా స్థితికి చేరిన 18 ఏళ్ల యువతికి వైద్యులు 45 రోజులు శ్రమించి ప్రాణం పోశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 25 Sept 2026 7:16 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు జీజీహెచ్‌లో అద్భుతం 45 రోజుల్లో కోలుకున్న యువతి!

Kurnool: బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై, శస్త్రచికిత్స అనంతరం ఇంట్యూబేషన్‌తో కూడిన వెజిటేటివ్ స్టేట్‌లో ఉన్న 18 ఏళ్ల యువతికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (GGH) అత్యంత శ్రద్ధతో అందించిన చికిత్సతో స్పృహ తిరిగి రావడంతో వైద్యులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

గార్గేయపురానికి చెందిన రేష్మ, ( D/o కలీల్ బాషా) ను 15-07-2026 న బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై శస్త్రచికిత్స అనంతరం GGHకు వచ్చింది. అనంతరం MS-5 విభాగంలో డా. మాధవి శ్యామల, MS, ప్రొఫెసర్ పర్యవేక్షణలో చికిత్స పొందింది. RICUలో రోగికి నిరంతర వైద్య పర్యవేక్షణతో పాటు వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో మల్టీడిసిప్లినరీ విధానంలో చికిత్స అందించారు.

సర్జరీ యూనిట్‌కు చెందిన డా. మాధవి శ్యామల, డా. చంద్రారెడ్డి, డా. కార్తీక్, అనస్థీషియా విభాగానికి చెందిన డా. శివ నాయక్, డా. మురళి ప్రభాకర్ తో పాటు న్యూరాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల వైద్య బృందాలు చికిత్సలో భాగస్వామ్యమయ్యాయి.

ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వరులు, (MS, ఆర్థోపెడిక్స్) పర్యవేక్షణలో రోగికి అవసరమైన వైద్య సేవలు, మందులు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకున్నారు. చికిత్సలో భాగంగా ఆల్బుమిన్, సెలమైన్ తదితర ఖరీదైన మందులను కూడా అవసరానికి అనుగుణంగా అందించారు.

సుమారు 45 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం రేష్మకు స్పృహ తిరిగి రావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. అనంతరం 15-09-2026న వైద్యుల సూచనల మేరకు ఆమెను డిశ్చార్జ్ చేశారు.

ప్రస్తుతం రోగి తదుపరి వైద్య పరీక్షలు మరియు ఆరోగ్య పరిస్థితి సమీక్ష కోసం ఈరోజు ఆసుపత్రికి రాగా, వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన చికిత్సను కొనసాగిస్తూ, వైద్యులు సూచించిన మందులు, జాగ్రత్తలు క్రమం తప్పకుండా పాటించాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL