Nandigama: టీడీపీపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు!

Nandigama: నందిగామ వైకాపా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వర రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

Naresh, Nandigama
Published on: 17 Oct 2026 6:02 PM IST
Nandigama
X

Nandigama: టీడీపీపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు!

Nandigama: నందిగామ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వర రావు నామినేషన్ దాఖలు చేశారు...నామినేషన్ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు పాల్గొన్నారు...

ప్రత్యేక పూజలు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలపరిచారు....అనంతరం తెలుగుదేశం పార్టీపై హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్..... ఆర్యవైశ్యులను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆర్యవైశ్యులకు ఆ పార్టీలో సరైన గుర్తింపు లేదని కేవలం ఓటర్ గా మాత్రం మార్చారని అన్నారు...

తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల రావడంతో సంబంధం లేని వ్యక్తులకు టిడిపి టికెట్ ఇస్తుందని సంతలో వేలం వేసి పశువుల్ని గొర్రెలను కొన్నట్టు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని కొనుగోలు చేసిందని అన్నారు..

దశాబ్దాల కాలంగా ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉండి పార్టీ కోసం కష్టపడి పని చేస్తే కనీసం వారికి గుర్తింపు ఇవ్వలేదని తెలిపారు ఎమ్మెల్సీ...

తెలుగుదేశం పార్టీ నిబద్ధత గల నాయకున్ని ఎంపిక చేసుకోవాల్సింది పోయి ఆ పార్టీని చూస్తుంటే తమకు నవ్వొస్తుందని మరోపక్క జాలి కలుగుతుందని ఎమ్మెల్సీ అన్నారు...

తెలుగుదేశం నాయకత్వం ఎంతో పటిష్టంగా ఉండేదని సీనియర్ నాయకులు అందరూ ఏమైపోయారు అని కేవలం ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీనియర్ నాయకత్వాన్ని పక్కకు నెట్టేసారని వాపోయారు...

స్థానిక టిడిపి నాయకులను తొక్కేశారని ఇప్పుడున్న ఎమ్మెల్యేకు కావాల్సింది చెప్పు చేతల్లో ఉండే మనుషులని డబ్బు సంపాదించి ఇచ్చే మనుషులని తప్ప నందిగామ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులు కాదని మొండితోక అరుణ్ కుమార్ అన్నారు...

Naresh, Nandigama

Naresh, Nandigama