Kankipadu: ప్రజాసేవే సంకల్పంగా కంకిపాడు జెడ్పీటీసీ బరిలో యలమంచిలి అనూష!
Kankipadu: కంకిపాడు జెడ్పీటీసీ అభ్యర్థిగా వై. అనూష బరిలోకి దిగుతున్నట్లు ప్రకటన. రాజకీయ, సామాజిక సేవా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆమె.
Kankipadu: రాజకీయ నేపథ్యం ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి గుర్తింపునిస్తే, ప్రజలతో మమేకమై, వారి అవసరలాను అర్ధం చేసుకుంటూ, వారి కష్ట నష్టాలలో అండగా ఉంటూ సేవ చేయడం ఆ గుర్తింపుకు నిజమైన అర్థాన్నిస్తుంది. అలాంటి రాజకీయ, సామాజిక సేవా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన యలమంచిలి అనూష అనూహ్యంగా జెడ్పీటీసీ సభ్యురాలిగా బరిలోకి దిగుతూ, ప్రజాక్షేత్రంలో తన బాధ్యతను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఉన్నత విద్యలో బి.ఫార్మసీ పూర్తి చేసిన అనూష, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రాజకీయ కార్యకలాపాలకే తన పాత్రను పరిమితం చేయకుండా, పేదలకు అండగా నిలవడం, అవసరమైన వారికి సహాయం అందించడం వంటి సేవా కార్యక్రమాల్లోనూ ఆమె భాగస్వాములయ్యారు. ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సమయంలో సామాన్య ప్రజలు, వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో ఆమె విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆమె సామాజిక బాధ్యతకు నిదర్శనం.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం ఆమె స్వగ్రామం. ఆమె పుట్టింటి కుటుంబం సైతం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో కొనసాగుతూ, తమ గ్రామంలో రాజకీయంగా ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. అటువంటి రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబంలో పెరిగిన అనూషకు ప్రజాజీవితం కొత్త కాదు.
అలాగే, ఆమె అత్తింటి కుటుంబానికీ ప్రజాసేవలో ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. ఆమె మామగారైన యలమంచిలి కిషోర్‌బాబు ఎన్టీఆర్ సేవారత్న పురస్కార గ్రహీతగా, కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ చైర్మన్‌గా, వివిధ బాధ్యతలు నిర్వహించి, మండల వ్యాప్తంగా సామజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కిషోర్ బాబు తండ్రి, దివంగత యలమంచిలి శ్రీరాములు సైతం కోలవెన్ను గ్రామ సర్పంచిగా విశేషంగా సేవలందించారు. ఇలా తరతరాలుగా ప్రజాజీవితంతో అనుబంధం కలిగిన కుటుంబ వారసత్వం అనూషకు ఒక నేపథ్యంగా నిలుస్తోంది.
అనూష భర్త యలమంచిలి భార్గవ్ రామ్ సైతం ప్రస్తుతం కంకిపాడు తెలుగుయువత అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కుటుంబంలో రాజకీయ చైతన్యం, పార్టీ పట్ల నిబద్ధతతో పాటు, సమాజంలోని పేదల పట్ల సేవాభావం కూడా కొనసాగడం ఈ కుటుంబ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్న అనూష, జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని స్థానిక పార్టీ శ్రేణులు, నాయకత్వం ఆకాంక్షిస్తుండటం గమనార్హం.




