Vuyyuru: ఉయ్యూరు జడ్పీ హైస్కూల్‌లో విజిలెన్స్‌పై అవగాహన సదస్సు
Vuyyuru: విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ సందర్భంగా ఉయ్యూరు జడ్పీహెచ్‌ఎస్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్, అవగాహన సదస్సు నిర్వహించారు.
Vuyyuru: ఉయ్యూరు జడ్పీ హైస్కూల్‌లో విజిలెన్స్‌పై అవగాహన సదస్సు
ఉయ్యూరు: విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉయ్యూరు శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉయ్యూరులోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విజిలెన్స్, నిజాయితీ, సమగ్రత (ఇంటిగ్రిటీ) ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విజిలెన్స్ ఇన్‌చార్జి శ్రీ బి. హరీష్ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విజిలెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నిజాయితీ, నైతిక విలువలను పాటిస్తూ సమగ్రతను పెంపొందించుకోవాలని సూచించారు. అవినీతి నిరోధక చర్యల్లో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తమవంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్ మీట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ రీజినల్ మేనేజర్ శ్రీ కె. ఆంజనేయులు, జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ టి. నాగేశ్వరరావు, రీజినల్ ఆఫీసర్ శ్రీ జగదీష్, ఉయ్యూరు బ్రాంచ్ మేనేజర్ శ్రీమతి కె. భావన తదితరులు పాల్గొన్నారు.




