Uyyuru: ఉయ్యూరు 24వ వార్డులో బోడే హేమ ప్రచారం!

Uyyuru: ఉయ్యూరు 24వ వార్డు కూటమి అభ్యర్థి షేక్ మోబీన విజయాన్ని కాంక్షిస్తూ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సతీమణి బోడే హేమ విస్తృత ప్రచారం చేశారు.

Ramana, Penamaluru
Published on: 27 Oct 2026 1:47 PM IST
Uyyuru
X

Uyyuru: ఉయ్యూరు 24వ వార్డులో బోడే హేమ ప్రచారం!

Uyyuru: ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధి,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు, పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారం,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉయ్యూరు మున్సిపాలిటీలోని 24వ వార్డు కూటమి కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి షేక్ మోబీన గారి విజయాన్ని కాంక్షిస్తూ పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు

శ్రీ బోడే ప్రసాద్ గారి సతీమణి

శ్రీమతి బోడే హేమ గారు కూటమి నాయకులు,కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను ఆప్యాయంగా కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు,ఉయ్యూరు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన రహదారులు,మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు,ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ పరిష్కారానికి కృషి చేస్తుందని వివరించారు.

ప్రజల అవసరాలను గుర్తించి,అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

ఉయ్యూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు ఎంతో అవసరమని,ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు అంకితమవుతామని ఈ సందర్భంగా నాయకులు భరోసా ఇచ్చారు. ఉయ్యూరు అభివృద్ధికి కూటమి బాట… ప్రజాసేవే మా లక్ష్యం.

Ramana, Penamaluru

Ramana, Penamaluru