Uyyuru: రైతుల సమక్షంలోనే భూ రీసర్వే 2.0 డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్
Uyyuru: రైతుల సమక్షంలోనే భూ రీసర్వే 2.0 నిర్వహించాలని, e-KYC తప్పనిసరి అని సర్వే డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కృష్ణా జిల్లాలో ఆకస్మిక తనిఖీ.
Uyyuru: రైతుల సమక్షంలోనే భూ రీసర్వే 2.0 డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్
ఉయ్యురు: భూము ల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగా నే సమాచారం అందించి వారి సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలని, ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చెయ్యాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంటు అండ్ లాండు రికార్డ్స్ డైరెక్టరు రోణంకి కూర్మనాథ్ అన్నారు.
మంగళవారం పమిడి ముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామం, తోట్ల వల్లూరు మండలం సౌత్ వల్లూరు గ్రామాలలో నిర్వహిస్తున్న రీ-సర్వే కార్యక్రమాన్ని జిల్లా రెవిన్యూ, సర్వే అధికారులతో కలిసి ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. రైతులు సమక్షంలో సర్వే జరగడంతో అయన హర్షం వ్యక్తం చేశారు. రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
సర్వే మొదలు పెట్టేరోజున తప్పనిసరిగా సంబంధిత రైతులు లేదా కుటుంబ సభ్యులు క్షేత్ర స్థాయిలో తప్పక ఉండాలని, సర్వే పూర్తయిన తరువాత డాక్యుమెంటు వెరిఫికేషన్ ద్వారా సరిహద్దులు నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలన్నారు. రైతులు చేతికి సరైన కొలతలతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం అందజేసే వరకూ సమాచారం తప్పనిసరిగా అందించేలా చూడాలని జిల్లా సర్వే సహాయ సంచాలకులను పూజారి లక్ష్మణరావును ఆదేశించారు.
అనంతరం ఉయ్యురు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అక్ష్మికంగా తనిఖీ చేసి ఉయ్యురు మండలానికి సంబందించిన వీఆర్వో, లాగిన్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ కుర్మనాద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేలో తప్పులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో భూ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు రైతులు సమక్షంలోనే రీసర్వే నిర్వహించే విధంగా రీసర్వే 2.0 నిర్వహిస్తున్నామన్నారు. రీసర్వే నిర్వహించిన తరువాత నోటీసు రూపంలో రైతులకు చూపించిన భూహద్దులు ప్రకారం భూవివరాలను తెలియజేయడం, డాక్యుమెంట్లతో సరిపోల్చుకుని నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కేవైసీ చేయించడం ద్వారా రైతులు సమక్షంలో సర్వే నిర్వహించడంతో పాటు రైతులకు అన్ని విధాలా సమాచారం అందిస్తూ ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రీసర్వేల్లో ఫేజ్-1లో 628, ఫేజ్-2 లో 748, ఫేజ్-3 లో 729, ఫేజ్-4 లో 1645 గ్రామాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,800 బృందాలతో అత్యాధునిక రోవర్స్ తో సర్వే నిర్వహించడం జరుగుతున్నద న్నారు.
క్షేత్ర స్థాయిలో భూవివరాలు, డాక్యుమెంటు పరంగా గల వివరాలను రైతులు సమక్షంలోనే సరిపోల్చుతూ ఇకముందు ఎటువంటి భూ వివాదాలకు తావులేకుండా రైతులు సంతృప్తి చెందే విధంగా రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఫేజ్-5 లో రాష్ట్ర వ్యాప్తంగా 1,343 గ్రామాలలో రైతులతో కలిసిమెలిసి క్షేత్రస్థాయిలో రీసర్వే నిర్వహిస్తున్నామన్నామని, రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.
క్షేత్రస్థాయిలో సమస్యలెదురైతే తక్షణ పరిష్కారం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ విధానాలు పరంగా 2027 మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు తమ అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో జిల్లా సర్వే సహాయ సంచాలకులు పూజారి లక్ష్మణరావు, ఉయ్యురు ఆర్డీఓ ఎస్ కరుణా కుమారి, ఉయ్యురు, పమిడి ముక్కల, తోట్ల వల్లూరు తహశీల్దార్లు, ఉయ్యురు డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, రీసర్వే డిప్యూటీ తహశీల్దారు , మండల సర్వేయరు , రెవెన్యూ, సర్వే సిబ్బంది, గ్రామ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.




