Uyyuru: 13వ వార్డులో కూటమి అభ్యర్థి సుబ్బారావు తరఫున బోడే హేమ ప్రచారం!
Uyyuru: ఉయ్యూరు 13వ వార్డు కూటమి అభ్యర్థి బొర్రా సుబ్బారావుకు మద్దతుగా బోడే హేమ ప్రచారం. పట్టణాభివృద్ధికి కూటమిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.
Uyyuru: 13వ వార్డులో కూటమి అభ్యర్థి సుబ్బారావు తరఫున బోడే హేమ ప్రచారం!
ఉయ్యూరు: 13వ వార్డు కూటమి అభ్యర్థి బొర్రా సుబ్బారావు విజయమే లక్ష్యంగా ఇంటింటికీ ప్రచారం – ఉయ్యూరు ప్రగతికి కూటమికి పట్టం కట్టాలని బోడే హేమ గారి విజ్ఞప్తి.
ఉయ్యూరు మున్సిపాలిటీ ఎన్నికల వేళ కూటమి ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది,పట్టణంలో ప్రజల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా కూటమి నాయకులు,కార్యకర్తలు విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ క్రమంలో ఉయ్యూరు మున్సిపాలిటీ 13వ వార్డులో కూటమి కౌన్సిలర్ అభ్యర్థి
శ్రీ బొర్రా సుబ్బారావు గారి విజయాన్ని కాంక్షిస్తూ పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి సతీమణి శ్రీమతి బోడే హేమ గారు కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు,వార్డులోని ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ, ఉయ్యూరు పట్టణానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి నాయకత్వం కృషి చేస్తోందని వివరించారు,ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రమే కాకుండా,ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.
రాజకీయాలు అంటే పదవుల కోసం పోటీ కాదు...ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి చేసే బాధ్యతాయుతమైన సేవ,ఈ స్ఫూర్తితో ఉయ్యూరు పట్టణంలో రహదారులు,డ్రైనేజీ,తాగునీరు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడమే కూటమి లక్ష్యమని తెలిపారు.
ప్రజల సమస్యలను పట్టించుకునే నాయకుడికి, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే ప్రతినిధికి ప్రజలు అవకాశం ఇవ్వాలని బోడే హేమ గారు కోరారు, 13వ వార్డులో బొర్రా సుబ్బారావు గారిని గెలిపించి ఉయ్యూరు అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
కూటమి నాయకులు,కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటూ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. 13వ వార్డులో కూటమి జెండా ఎగరాలి… ఉయ్యూరు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కాలి.




