Uyyuru: గండిగుంట-2 అంగన్‌వాడీ కేంద్రంలో ఉత్సవాలు.. పాల్గొన్న ఏఎంసీ ఛైర్మన్

Uyyuru: ఉయ్యూరు మండలం గండిగుంట-2 అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన ఉత్సవాల్లో ఏఎంసీ ఛైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ పాల్గొని, సిబ్బందిని ఘనంగా సత్కరించారు.

Ramana, Penamaluru
Published on: 1 Oct 2026 6:04 PM IST
Uyyuru
X

Uyyuru: గండిగుంట-2 అంగన్‌వాడీ కేంద్రంలో ఉత్సవాలు.. పాల్గొన్న ఏఎంసీ ఛైర్మన్

ఉయ్యూరు: ఉయ్యూరు మండలం గండిగుంట2 అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉయ్యూరు AMC ఛైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ గారు, అంగన్వాడీ సిబ్బందికి, తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు.

30సంవత్సరాల నుండి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలు, మహిళలకు ఆర్థికభరోసా, ఆరోగ్యాన్ని కాపాడాలన్నే లక్ష్యాలలో భాగంగా డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ కేంద్రాలను భారతదేశంలో తొలిగా ప్రారంభించారని, బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, కొండా ప్రవీణ్ తెలిపారు.

ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి అందిస్తూ, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, రాబోయే 5యేళ్లలో యువతకు ఉపాధి అవకాశాలతో పాటు, ప్రతి కుటుంబంలో ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తారని AMC ఛైర్మన్ కొండా ప్రవీణ్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సిబ్బందిని సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొండా రత్నవేణి, ఐటిడిపి ఉపాధ్యక్షులు గోరుముచ్చు వెంకటసాయి,

సూపర్వైజర్ వెంకట రాఘవమ్మ, టీచర్లు కనకాలక్ష్మి, కే నాగ విజయలక్ష్మి, జె మోహన, ఎన్ . కుమారి, వి. నిర్మలజ్యోతి, జి అరుణ, కే వరలక్ష్మి, హెల్పర్ బేబీ సరోజినీ, anm నాగలక్ష్మి, ఆశావర్కర్లు రాణి, బేబీ తదితరులు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru