Nandigama: మోగులూరులో టీడీపీ జోరు: మూరకొండ ఏడుకొండలు
Nandigama: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరులో జడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు, ఎంపీటీసీ అభ్యర్థులు గద్దె స్వప్న, ఆదిపూడి శివగంగారావు ఇంటింటి ప్రచారం చేశారు.
Nandigama: మోగులూరులో టీడీపీ జోరు: మూరకొండ ఏడుకొండలు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: మోగులూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఐకమత్యంతో ఉంటే ఎంపీటీసీ సెగ్మెంట్ లు రెండు మనవే... మూరకొండ ఏడుకొండలు, 1983 నుంచి తెలుగుదేశం పార్టీ కి కంచుకోట ఈ మోగులూరు గ్రామం.... జెడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోగులూరు గ్రామ నాయకులు ఓడిపోతున్నారు.
మోగులూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు మనం గెలుస్తున్నాము.. కంచికచర్ల మోగులూరు గ్రామంలో 1 వ సెగ్మెంట్ 2 సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు గద్దె స్వప్న, ఆదిపూడి శివగంగారావు తో కలసి ఎన్నికల ప్రచారం చేశారు కంచికచర్ల జడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు. మోగులూరు ఎంపీటీసీ సెగ్మెంట్ లో భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు.
సెగ్మెంట్ లో ఇంటి ఇంటికి తిరుగుతూ ఎంపీటీసీ అభ్యర్థులకు జెడ్పీటీసీ అభ్యర్థికి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కంచికచర్ల జడ్పీటీసీ అభ్యర్థి "మూరకొండ ఏడుకొండలు" మాట్లాడుతూ:
కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో ప్రజల యొక్క స్పందన చూస్తుంటే కూటమి పార్టీ చేసిన అభివృద్ధి ఏమిటో అర్థం అవుతుంది. గులూరు ప్రజలు మా ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారు. మోగులూరు గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు బీటీ రోడ్లు పలు సమస్యలు ఉన్నాయి.
ఈ సమస్యలు అన్ని మేము ఎంపీటీసీ లుగా జడ్పీటీసీగా నేను గెలిచిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కారం చేస్తాము. అధికారంలో ఉన్న వాళ్ళకు ఓటు వేస్తే అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే మీ ఓటు, అభివృద్ధి ఆగిపోతుంది. మోగులూరు గ్రామం అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం. జెడ్పీటీసీ అభ్యర్థి మూరకొండ ఏడుకొండలు.




