Kankipadu: పట్టాలపై వ్యక్తి మృతదేహం రైలు పైనుంచి జారిపడి మృతి!
Kankipadu: కృష్ణా జిల్లా ఉప్పులూరు-ఇందుపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు అనుమానం.
Kankipadu: పట్టాలపై వ్యక్తి మృతదేహం రైలు పైనుంచి జారిపడి మృతి!
Kankipadu:ఉప్పులూరు ఇందుపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మంతెన గ్రామం సమీపంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు లభ్యం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం, మృతుడి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం ఆగష్టు 23న ఉదయం 9:30 గంటల సమయంలో లేదా అంతకంటే ముందు జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రయాణంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడటం వల్లే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు వెంటనే గుడివాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ (GRP) ఎస్ఐ (SI) గారిని సంప్రదించాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.




