NTR: టీడీపీ అభ్యర్థి రోజా రాణికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు!

NTR: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం రామచంద్రపురం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి రోజా రాణికి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 21 Nov 2026 12:10 PM IST
NTR
X

NTR: టీడీపీ అభ్యర్థి రోజా రాణికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు!

NTR: ఏ.కొండూరు మండలం రామచంద్రపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గడ్డి కృష్ణారెడ్డి సతీమణి రోజా రాణి నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ర్యాలీ సందడిగా సాగింది.

ఈ క్రమంలో విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్గమధ్యంలో తన కాన్వాయ్‌ను నిలిపి టీడీపీ సర్పంచ్ అభ్యర్థి రోజా రాణికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా కాన్వాయ్ నిలిపి రోజా రాణికి శుభాకాంక్షలు తెలపడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ పరిణామం ర్యాలీలో పార్టీ శ్రేణులకు మరింత జోష్ నింపింది.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru