Tiruvuru: చింతలపాడులో భారీ సుడిగాలి బీభత్సం - దెబ్బతిన్న ఇళ్లు

Tiruvuru: తిరువూరు మండలం చింతలపాడులో సుడిగాలి బీభత్సం. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి, సహాయక చర్యలు చేపడతామన్న ఆర్డీవో ఏ. కుమార్.

Venkateswara Rao, Tiruvuru
Published on: 23 Sept 2026 6:40 PM IST
Tiruvuru
X

Tiruvuru: చింతలపాడులో భారీ సుడిగాలి బీభత్సం - దెబ్బతిన్న ఇళ్లు

తిరువూరు: తిరువూరు మండలం,పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో, ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో, చింతలపాడు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో, భారీ సుడిగాలి వీచింది. ఈ సుడిగాలి,కారణంగా గ్రామంలోని,పలు రేకుల ఇళ్లు, పెంకుటిళ్లు,దెబ్బతినడంతో, పాటు, ఇళ్లపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు గాలికి ఎగిరిపోయాయి,,కొన్ని ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి..

విషయం తెలుసుకున్న తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్, వెంటనే చింతలపాడు గ్రామానికి, వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్ , రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru