Tiruvuru: తిరువూరులో విషాదం.. ప్రసవం తర్వాత యువతి మృతి!
Tiruvuru: తిరువూరులోని వైష్ణవి హాస్పిటల్‌లో డెలివరీ ఆపరేషన్ వికటించి యువతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
Tiruvuru: తిరువూరులో విషాదం.. ప్రసవం తర్వాత యువతి మృతి!
Tiruvuru: తిరువూరు పట్టణంలోని వైష్ణవి హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 11వ తేదీన డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన 22 ఏళ్ల యువతి మృతి చెందడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు విస్సన్నపేట మండలం నూతిపాడు గ్రామస్థులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే విస్సన్నపేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మన్నెం నాగలక్ష్మి (22) బుధవారం ప్రసవం నిమిత్తం తిరువూరులోని వైష్ణవి హాస్పిటల్‌కు వచ్చారు. వైద్యులు డెలివరీ కోసం ఆపరేషన్ నిర్వహించగా ఆడపిల్ల జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే ఆపరేషన్ అనంతరం నాగలక్ష్మి ప్లేట్‌లెట్స్ పడిపోయాయని, మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమకు వైద్య రిపోర్టులు సైతం అందించకుండా ఆసుపత్రి నుంచి పంపించేందుకు ప్రయత్నించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహంతో ఆస్పటల్ పైన డాక్టర్ కారు పైన దాడి దిగిన కుటుంబ సభ్యులు.




