Pedana: పెడనలో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి జోష్నా రాణి గెలుపే మా లక్ష్యం!

Pedana: పెడన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జోష్నా రాణి గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు పనిచేస్తున్నారని బొడ్డు వేణుగోపాలరావు తెలిపారు.

Reddy, Pedana
Published on: 21 Oct 2026 8:47 AM IST
Pedana
X

Pedana: పెడనలో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి జోష్నా రాణి గెలుపే మా లక్ష్యం!

Pedana: పెడన పురపాలక చైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జోష్నా రాణి విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు తెలిపారు. చైర్‌పర్సన్ అభ్యర్థిగా జనసేన జోష్నా రాణి ఎంపికపై టీడీపీలో ఎలాంటి అసంతృప్తి లేదని, కూటమి ధర్మానికి కట్టుబడి ఆమె విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

చేనేత సామాజికవర్గానికి ప్రాధాన్యమిస్తూ జనసేన అధిష్ఠానం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. పెడనలో విజయదశమి సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పట్టణంలోని హిందూ శ్మశానవాటిక అభివృద్ధి ప్రధాన ఎన్నికల అంశమని వేణుగోపాలరావు అన్నారు. ఇప్పటికే సుమారు 90 శాతం ప్రహరీ నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పనులను కూడా జోష్నా రాణి ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని తెలిపారు. శ్మశానవాటిక అభివృద్ధిని అడ్డుకునే శక్తులకు అవకాశం ఇవ్వకుండా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమష్టిగా పనిచేస్తూ కూటమి అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్ అభ్యర్థి జోష్నా రాణికి గాజు గ్లాసు గుర్తుపై, కూటమి వార్డు అభ్యర్థులకు వారి పార్టీ గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Reddy, Pedana

Reddy, Pedana