Tadigadapa: తాడిగడపలో ప్రతిరోజూ ఒక అభివృద్ధి ప్రకటన ప్రత్యేక కార్యక్రమం

Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేయడానికి 'ప్రతిరోజూ ఒక అభివృద్ధి ప్రకటన' కార్యక్రమం ప్రారంభించారు. వ్యయం, ప్రయోజనాల వెల్లడి.

Ramana, Penamaluru
Published on: 30 Sept 2026 1:28 PM IST
Tadigadapa
X

Tadigadapa: తాడిగడపలో ప్రతిరోజూ ఒక అభివృద్ధి ప్రకటన ప్రత్యేక కార్యక్రమం

Tadigadapa: ప్రతిరోజూ ఒక అభివృద్ధి ప్రకటన అభివృద్ధి అంటే మాటలు కాదు… ప్రజల కళ్లముందు కనిపించే మార్పు! మన తాడిగడప మున్సిపాలిటీలో ప్రజల అవసరాలను గుర్తించి చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రతి ప్రాంతానికి అందుతున్న మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలను…ప్రతిరోజూ ఒక “అభివృద్ధి ప్రకటన”గా మీ ముందుకు తీసుకువస్తున్నాం.

ఏ పని? ఎక్కడ జరుగుతోంది? ఎంత వ్యయంతో? ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి? అనే విషయాలను స్పష్టంగా ప్రజలకు తెలియజేయడమే మా లక్ష్యం. ప్రారంభమైన పని నుంచి… పూర్తయిన అభివృద్ధి వరకు… ప్రతి అడుగు ప్రజల కోసం… ప్రతి పని ప్రాంత అభివృద్ధి కోసం… ప్రతి ప్రగతి ప్రజల ముందే! అభివృద్ధి ఆగకూడదు… ప్రజా సంక్షేమం ముందుకు సాగాలి… తాడిగడప మరింత అభివృద్ధి చెందాలి! తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు

Ramana, Penamaluru

Ramana, Penamaluru