Tadigadapa: తాడిగడపలో టీడీపీకి భారీ బూస్ట్.. 2వ వార్డు ఏకగ్రీవం!
Tadigadapa: తాడిగడప మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చుండూరు రామచంద్రరావు నామినేషన్ ఉపసంహరించుకుని టీడీపీలో చేరడంతో వార్డు ఏకగ్రీవమైంది.
Tadigadapa: తాడిగడపలో టీడీపీకి భారీ బూస్ట్.. 2వ వార్డు ఏకగ్రీవం!
తాడిగడప: తాడిగడప మున్సిపల్ ఎన్నికల్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ తరఫున 2వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసిన చుండూరు రామచంద్రరావు తన నామినేషన్ ఉపసంహరించుకుని టీడీపీలో చేరారు.
స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరిన రామచంద్రరావు. ఆయన నామినేషన్ ఉపసంహరణతో 2వ వార్డు ఏకగ్రీవమైనట్లు సమాచారం. తాడిగడప మున్సిపల్ ఎన్నికల్లో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.




