Vuyyuru: ఉయ్యూరు టౌన్ ఎస్సై ప్రతాప్ రెడ్డి కంకిపాడుకు బదిలీ!

Vuyyuru: ఉయ్యూరు టౌన్ ఎస్సై కె. ప్రతాప్ రెడ్డిని కంకిపాడుకు బదిలీ చేస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

Ramana, Penamaluru
Published on: 30 Sept 2026 7:25 PM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరు టౌన్ ఎస్సై ప్రతాప్ రెడ్డి కంకిపాడుకు బదిలీ!

Vuyyuru: ఉయ్యూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై కె. ప్రతాప్ రెడ్డిని కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఆర్. లక్ష్మణరాజును ఉయ్యూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌కు నియమించారు.

కేవలం ఐదు నెలలపాటు ఉయ్యూరులో పనిచేసిన ప్రతాప్ రెడ్డి, స్వల్పకాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసి సమర్థుడైన అధికారిగా పేరు పొందారు.

కంకిపాడుకు వెళుతున్న సందర్భంగా ప్రతాప్ రెడ్డికి ఉయ్యూరు టౌన్ సీఐ టి.వి.వి. రామారావు. ఎస్సై మల్లికాసులు మరియు సిబ్బంది సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ కూడా ఇదే అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ, ప్రజల ఆదరణ పొందాలని, పోలీస్ శాఖకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru