Tiruvuru: తిరువూరు మండలం చింతలపాడులో భీకర గాలుల బీభత్సం!

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చింతలపాడులో వీచిన భీకర గాలులకు ఇళ్ల రేకులు ఎగిరిపోయి, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

Venkateswara Rao, Tiruvuru
Published on: 23 Sept 2026 7:09 PM IST
Tiruvuru
X

Tiruvuru: తిరువూరు మండలం చింతలపాడులో భీకర గాలుల బీభత్సం!

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు (మం) చింతలపాడుపై విరుచుకుపడిన భీకర గాలులు. ఒక్క నిమిషంలో గ్రామం కకావికలం. భీకర గాలుల బీభత్సంతో చింతలపాడులో ఎటుచూసినా విధ్వంసమే. గాలుల ధాటికి ఇళ్ల రేకులు ఎగిరిపోయి.. భయంతో వణికిపోయిన ప్రజలు. గాల్లో కొట్టుకొచ్చిన రేకులు, వస్తువులు తగిలి ఐదుగురికి తీవ్ర గాయాలు. వందలాది విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకొరిగినట్లు సమాచారం. ఒక్కసారిగా విరుచుకుపడిన గాలులతో గ్రామం అతలాకుతలం.

ప్రాణభయంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన గ్రామస్తులు. చింతలపాడులో ఎటుచూసినా నేలకొరిగిన చెట్లు.. విరిగిపడిన విద్యుత్ స్తంభాలే. చెట్లు, విద్యుత్ స్తంభాలు రహదారులపై పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం.

భీకర గాలుల దెబ్బకు భారీగా ఆస్తి నష్టం..నష్టంపై అధికారుల అంచనా. పరిస్థితిని పరిశీలించేందుకు రంగంలోకి దిగిన ఆర్డీవో ఏ. కుమార్. రెవెన్యూ సిబ్బందితో కలిసి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆర్డీఓ పరిశీలన.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru