Vijayawada: విజయవాడ వాంబే కాలనీ వద్ద రైల్వే బ్రిడ్జి లేక ప్రజల నరకయాతన!
Vijayawada:వాంబే కాలనీ వద్ద రైల్వే బ్రిడ్జి లేక ప్రజలు ప్రాణాలకు తెగించి ట్రాక్ దాటుతున్నారని, తక్షణమే బ్రిడ్జికి నిధులు మంజూరు చేయాలని సీపీఎం నేత బాబురావు డిమాండ్ చేశారు..
Vijayawada: విజయవాడ వాంబే కాలనీ వద్ద రైల్వే బ్రిడ్జి లేక ప్రజల నరకయాతన!
Vijayawada: నేడు బాబురావు, సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎస్కే. పీర్ సాహెబ్ , మహిళా నేత రత్నకుమారి తదితరులతో కలిసి వాంబే కాలనీ రైల్వే లైన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు.రైల్వే లైన్ దాటి ప్రయాణిస్తున్న అనేక మందితో మాట్లాడి, వారి కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంలో స్థానికులు వెల్లడించిన సమస్యలు.. ఈ విధంగా ఉన్నాయి.వాంబే కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు అయినా, పాలకులు అనేకసార్లు హామీలు ఇచ్చినా, కాలనీ పక్కనే ఉన్న రైల్వే లైన్ పై బ్రిడ్జి నిర్మాణం జరగలేదు.అనేక ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు బ్రిడ్జి మంజూరు అయిందని, నిర్మాణం చేపడుతున్నామని. గత అనేక సంవత్సరాలుగా ప్రకటనలు ఇస్తున్నారు.
పైపెచ్చు కోర్టు కేసులు ఉన్నాయని అవాస్తవాలు చెప్పి ప్రజలను మభ్యపరుస్తున్నారు.ప్రతి ఎన్నికల సందర్భంలో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభిస్తామని హామీలు ఇచ్చి మోసగిస్తున్నారు.వాంబే కాలనీనే కాకుండా అజిత్ సింగ్ నగర్, పాయికాపురం మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వేలమంది ప్రజలకు సౌకర్యంగా ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణం అత్యవసరం.
తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఈ రైల్వే లైన్ దాటి ప్రయాణించవలసి వస్తోంది.గత 20 ఏళ్లలో అనేకమంది రైల్వే లైన్ దాటుతూ ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది గాయపడ్డారు.చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వేలాదిమంది రోజు 100 రూపాయలు ప్రయాణ ఖర్చులు భరించలేక, గత్యంతరం లేక రైల్వే లైన్ దాటి వెళ్ళవలసి వస్తోంది.
రైల్వే లైన్ దాటితే పది నిమిషాల్లో గమ్యం చేరుకునే సామాన్యులకు, సింగ్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్ళటానికి గంటల తరబడి సమయం పడుతుంది.అజిత్ సింగ్ నగర్ రెండవ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో, తరచూ ట్రాఫిక్ స్తంభించి, సకాలంలో పనులకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు.
రైల్వే లైన్ కి రెండు వైపులా ఉన్న మురుగు కాలువలను.చిన్నచిన్న రాళ్లు,చిన్నపాటి స్తంభాలపై.ఒంటి కాలు పై.. సర్కస్ చేసినట్టు ప్రమాదకర పరిస్థితుల్లో, కటిక చీకటిలో ప్రయాణిస్తున్నారు.ప్రభుత్వం ,రైల్వే శాఖ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోగా, సాధారణ ప్రజలు ప్రయాణించడానికి వీలు లేకుండా అడ్డుగోడ నిర్మించారు.రైల్వే లైన్ దాటి ప్రయాణిస్తున్న అనేకమంది సామాన్యులపై 500 నుండి 1000 రూ.. పెనాల్టీలు రైల్వే పోలీసులు వసూలు చేయడం దుర్మార్గం.
వర్షాకాలంలో బురదలో, దుర్భర స్థితిలో నడవవలసిన దుస్థితి ఏర్పడింది.నెలకు 3000 నుండి 5000 ఆదాయం పొందే ఇంటి పని వారు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు .ఆటోలు, బస్సులలో వెళ్లాలంటే వారి ఆదాయం మొత్తం ప్రయాణ ఖర్చులకే సరిపోతాయి.మా ప్రాణాలు కాపాడండి, మా జీవితాలు నిలబెట్టండి, మాకు రక్షణ కల్పించండి, మాకు అదనపు సహాయం చేయకపోయినా.. వేలాది రూపాయల ప్రయాణ ఖర్చులు లేకుండా చూడండి.
ఇలా పలువురు సామాన్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో బాబురావు మాట్లాడుతూ.రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడలో, వాంబే కాలనీలో బ్రిడ్జి లేక ప్రజలు నరకయాతన పడుతుంటే, కనీసం మానవత్వం లేకుండా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం ప్రదర్శించటం దుర్మార్గం.ఒట్టి మాటలు కట్టిపెట్టి, పార్లమెంటు, శాసనసభ్యులు నిధులు మంజూరు చేయించండి, రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించే చర్యలు చేపట్టండి.
విజయవాడ నగరం పైన, పేదల పైన.. కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఈ చిన్న చూపు?డబుల్, త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా చెప్పుకునే.. కూటమి నేతలు ఎందుకు రైల్వే శాఖ ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతులు పొందలేకపోతున్నారు, నిధులు మంజూరు చేయించలేకపోతున్నారు.
ప్రమాదాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా నేతలకు పట్టదా?వాంబే కాలనీ వద్ద రైల్వే బ్రిడ్జి, అజిత్ సింగ్ నగర్ లో రెండవ ఫ్లైఓవర్ కు తక్షణమే నిధులు మంజూరు చేయాలి
కేంద్రంలో 12 ఏళ్లుగా బిజెపి, ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రము




