Poranki: పోరంకి సెంటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి!

Poranki: పోరంకి సెంటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: స్కూటీని ఢీకొట్టిన లారీ, 70 ఏళ్ల వృద్ధుడు మృతి. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై ఘటన, పెనమలూరు పోలీసుల కేసు నమోదు.

Ramana, Penamaluru
Published on: 24 Sept 2026 2:26 PM IST
Poranki
X

Poranki: పోరంకి సెంటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి!

పోరంకి: విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి (NH-65)పై పోరంకి సెంటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 23.09.2026 రాత్రి సుమారు 7 గంటల సమయంలో పోరంకి గ్రామం సీతారాంపురం కాలనీకి చెందిన అల్లా శివప్రసాద్ (70) తన స్కూటీ *(AP39QE5519)*పై పెనమలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

పోరంకి సెంటర్ వద్దకు చేరుకున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ (AP24W2457) స్కూటీని ఢీకొట్టడంతో శివప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్‌లో విజయవాడ జీజీహెచ్ (GGH)కు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Ramana, Penamaluru

Ramana, Penamaluru