Penamaluru: పెనమలూరులో అభివృద్ధి జాతర ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై ప్రశంసలు
Penamaluru: పెనమలూరులో బోడె ప్రసాద్ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు: పల్లె పండుగతో గ్రామాలు సర్వాంగ సుందరంగా మారుతున్నాయని కిషోర్‌బాబు ప్రశంస.
Penamaluru: పెనమలూరులో అభివృద్ధి జాతర ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై ప్రశంసలు
Penamaluru: పల్లెలు పచ్చగా ఉంటేనే రాష్టం బాగుంటుందని నమ్ముతారు. అర్హులైన పేదలకు సంక్షేమ పధకాలు అందేలా చూడడటమే ఆయన విజయ రహస్యం. గ్రామీణ రహదారులు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణం, తాగు/సాగు నీరు, విద్యుత్, వ్యవసాయ మౌలిక వసతులు కల్పనకు నిర్విరామంగా కృషి చేస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారి దార్శినిక నాయకత్వంలో పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి పధంలో దూసుకుపోవడంలో ఆశ్చర్యం లేదని కంకిపాడు మండల తెదేపా సీనియర్ నాయకులు యలమంచిలి కిషోర్ బాబు అన్నారు.
పల్లె పండుగ 3.0 రాష్ట్రోత్సవం నేపధ్యంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ “సంక్షేమ పధకాల అమలు + గ్రామీణ మౌలిక వసతుల కల్పన + ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి” అనే మూడు కీలకాంశాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ప్రతీ ఒక్కరి మన్ననలు చూరగొంటుందని ప్రశంసించారు.
పల్లె పండుగ స్పూర్తితో కేవలం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో సరిపెట్టకుండా, ఆయా పధకాలు సత్వరమే పూర్తయ్యేలా అధికారులతో సమన్వయం చేసుకోవడం, అభివృద్ధి పనుల నాణ్యతపై కూడా దృష్టి పెట్టడం, అన్ని వేళలా నమ్ముకున్న క్యాడర్‌తో పాటు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం వంటి విలక్షణ శైలితో బోడె ప్రసాద్ గారు పెనమలూరు నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుతున్నారని కితాబిచ్చారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరచిన అభ్యర్ధులు ఘన విజయంతో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా పెనమలూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల ఉనికిని ప్రశ్నార్ధకం చేయనున్నారని జోస్యం చెప్పారు.




