Yanamalakuduru: యణమలకుదురులో వరుణ యాగం: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Yanamalakuduru: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ యణమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు.

Ramana, Penamaluru
Published on: 6 Oct 2026 8:27 PM IST
Yanamalakuduru
X

Yanamalakuduru: యణమలకుదురులో వరుణ యాగం: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Yanamalakuduru: యణమలకుదురు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ జపం,వరుణ యాగం కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు

శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరుణ దేవునికి ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు,కాలువలు, లాశయాలు నీటితో కళకళలాడాలని ఆకాంక్షించారు.

అలాగే పంటలు సమృద్ధిగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని,రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించారు, పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని శ్రీ బోడే ప్రసాద్ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru