Penamaluru: మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్
Penamaluru: పెనమలూరు నియోజకవర్గంలో కూటమిదే పైచేయి అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు.
Penamaluru: మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్
Penamaluru: కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు జడ్పీటీసీ అభ్యర్థులతో పాటు 43 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసినట్లు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. మూడు మండలాల్లోనూ అత్యధిక ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కంకిపాడు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా దండమూడి పూజిత, పెనమలూరు మండల అభ్యర్థిగా కాండ్రు సరిత, ఉయ్యూరు మండల అభ్యర్థిగా కంభంపాటి రమేష్‌బాబుకు బీ ఫారాలు అందజేసినట్లు బోడే ప్రసాద్ వెల్లడించారు. మూడు మండలాల్లోనూ ఎంపీపీ స్థానాలను కూటమి దక్కించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.




