Penamaluru: రూ.27 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసీల అందజేత

Penamaluru: పెనమలూరులో రూ.27 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసీలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పేదలకు కూటమి ప్రభుత్వం భరోసా.

Ramana, Penamaluru
Published on: 23 Sept 2026 6:45 PM IST
Penamaluru
X

Penamaluru: రూ.27 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసీల అందజేత

పెనమలూరు: పోరంకి నియోజకవర్గ కార్యాలయంలో పెనమలూరు నియోజకవర్గానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులు,మరో 5 మందికి LOCలు కలిపి సుమారు రూ.27 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ...

అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోంది,వైద్య ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా సాయం అందేలా కృషి చేస్తున్నాం అని తెలిపారు...

2014–19 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.20 కోట్ల మేర CMRF సాయం అందించామని కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలోనే సుమారు రూ.25 కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు.

అనారోగ్యం,అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయం అందిస్తూ ముందుంటానని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు హామీ ఇచ్చారు.

ప్రజారోగ్యం – సంక్షేమం – పేదల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.

సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందుకున్న లబ్ధిదారులు తమ కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి సాయం త్వరగా మంజూరు అయ్యేలా కృషి చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల కష్టం నా కష్టం..ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత... ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా బోడే ప్రసాద్ గారు...

Ramana, Penamaluru

Ramana, Penamaluru