Pedana: రూ.5.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత

Pedana: పెడనలో రూ.5.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. మౌలిక వసతుల కల్పనే ధ్యేయమన్న ఎమ్మెల్యే.

Reddy, Pedana
Published on: 26 Sept 2026 8:33 PM IST
Pedana
X

Pedana: రూ.5.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత

పెడన: పట్టణ అభివృద్ధికి మరింత ప్రాధాన్యతనిస్తూ, పెడన పురపాలక సంఘం పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం పట్టణంలో విస్తృతంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ పురపాలక సంఘానికి మంజూరైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ ( హెచ్ ఏ ఎం ) నిధులు రూ.12.00 కోట్లు, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.91.00 లక్షలు నుంచి చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో భాగంగా, ఈరోజు రూ.5.00 కోట్ల విలువైన హెచ్ ఏ ఎం పనులకు, రూ.15.00 లక్షల విలువైన 15వ ఆర్థిక సంఘం పనులకు శంకుస్థాపన చేశామన్నారు .

పట్టణంలోని 18, 19, 20, 21, 22, 23వ వార్డుల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర పనులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో రహదారుల అభివృద్ధి, రాకపోకలకు సౌకర్యం మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం లక్ష్యంగా పనులు శ్రీకారం చుట్టామన్నారు.

పెడన పట్టణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతూ, పట్టణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ బొడ్డు వేణుగోపాలరావు , పట్టణ టిడిపి అధ్యక్షుడు ఎక్కల శ్యామలరావు,కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వార్డు ఇన్‌చార్జిలు, ప్రజలు పాల్గొన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana