Pamarru: కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే అనిల్ తీవ్ర విమర్శలు!
Pamarru: పామర్రులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా.
Pamarru: కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే అనిల్ తీవ్ర విమర్శలు!
పామర్రు: కృష్ణా పామర్రు నియోజకవర్గం,పామర్రు వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్ రిపోర్టర్, భాను. గారపాటి ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎంపీపీ, జడ్పిటిసి స్థానాలను మేము గెలిచి తీరుతాం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. వైద్యం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆరోగ్యశ్రీని కుటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ ను తాతలు.. తండ్రులు సంప్రదించిన ఆస్తులుగా భావించి ప్రజల నుంచి దోసుకుంటున్నారు.
పామర్రు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ లో పెద్ద స్కామ్ జరుగుతుంది. పామర్రులో ఆఫీస్ ఖర్చులు కింద 10 శాతం వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు 15% దోచుకుంటున్నారు. పమిడిముక్కల మండలం లంకపల్లిలో 300 భూమిని అన్యక్రాంతం చేశారు.
600 ఎకరాలు భూమిని గవర్నమెంట్ ల్యాండ్ గా ట్రీట్ చేశారు. పామర్రు ఎమ్మెల్యే 300 కోట్లు స్కాం చేశారు. ఎన్నికల ముందు అందరికీ ఇళ్లస్థలాలు చూపిస్తామని చెప్పి ఆశ చూపి మోసం చేశారు. ఇప్పుడు కాలు గట్ల మీద ఐదు లక్షలకు ఇళ్ల స్థలాలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఏ విధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




