Pamarru: పామర్రు వీరాంజనేయ కాలనీలో నీటి ఎద్దడి: కైలే అనిల్ కుమార్

Pamarru: పామర్రు వీరాంజనేయ కాలనీలో తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వినతిపత్రం అందజేశారు.

Bhanu, Pamarru
Published on: 6 Oct 2026 5:41 PM IST
Pamarru
X

Pamarru: పామర్రు వీరాంజనేయ కాలనీలో నీటి ఎద్దడి: కైలే అనిల్ కుమార్

కృష్ణా జిల్లా: పామర్రు వీరాంజనేయ కాలనీలో త్రాగునీటి సమస్య పై పంచాయతీ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్ కు వినతి పత్రాన్ని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అందించారు.

మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కామెంట్స్:

టౌన్లో స్థానిక వీరాంజనేయ కాలనీలో త్రాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బినామీల రియల్ ఎస్టేట్ వెంచర్లోకి వచ్చిన మట్టి లారీలు కాలనీలోకి వెళ్లే నీటి పైప్ లైన్లను పగులగొట్టడంతో కాలనీ వాసులు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు.

వీరాంజనేయ కాలనీలో నీరు వెంటనే ప్రజలకు అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని కళ్లబొల్లి మాటలు చెప్పే స్థానిక ఎమ్మెల్యేకు కాలనీ వాసుల కష్టాలు ఏ మాత్రం పట్టడం లేదు.

కాలనీ వాసుల సమస్యను వెంటనే తీర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Bhanu, Pamarru

Bhanu, Pamarru