Penamaluru: పల్లె పండుగ 3.0తో గ్రామాల ప్రగతి: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Penamaluru: పెనమలూరు నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 ద్వారా రూ.88 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గంగూరు, వణుకూరు, చోడవరంలో శంకుస్థాపన చేశారు.

Ramana, Penamaluru
Published on: 3 Oct 2026 6:21 PM IST
Penamaluru
X

Penamaluru: పల్లె పండుగ 3.0తో గ్రామాల ప్రగతి: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Penamaluru: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తున్నామని పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు అన్నారు.

పల్లె పండుగ 3.0లో భాగంగా గంగూరు, వణుకూరు,చోడవరం గ్రామాల్లో మొత్తం రూ.88 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు ఇందులో గంగూరులో రూ.44 లక్షలు వణుకూరులో రూ.27 లక్షలు చోడవరంలో రూ.17 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ...

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు,డ్రైనేజీలు,ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు,పెనమలూరు నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

మొదటి విడతలో రూ.26 కోట్లు.. రెండో విడతలో సాస్కి ద్వారా రూ.11 కోట్లతో రహదారుల అభివృద్ధి

పెనమలూరు నియోజకవర్గంలో మొదటి విడతలో సుమారు రూ.26 కోట్లతో వివిధ రహదారి అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. రెండో విడతలో సాస్కి నిధుల ద్వారా సుమారు రూ.11 కోట్లతో గ్రామాల మధ్య కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రస్తుతం పల్లె పండుగ 3.0లో భాగంగా మరోసారి గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

గంగూరులో ఇప్పటికే అభివృద్ధి పనులు.. తాజాగా మరో రూ.44 లక్షలతో పనులు

గంగూరు గ్రామంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు, విలేజ్ కనెక్టివిటీ రోడ్లు,ధనేకుల ఇంజినీరింగ్ కళాశాల రోడ్డు, వేల్పూరు–గంగూరు రోడ్డు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో సుమారు రూ.1.75 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని,ప్రస్తుతం పల్లె పండుగ 3.0లో భాగంగా మరో రూ.44 లక్షలతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

వణుకూరులో రహదారి సమస్యలకు పరిష్కారం.. రూ.7 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్డు అభివృద్ధి

వణుకూరు గ్రామంలో ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సుమారు రూ.7 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టామని బోడే ప్రసాద్ గారు తెలిపారు. కొత్త కాలనీల రోడ్లు, పెనమలూరు–వణుకూరు రోడ్డు, కాసనేవారిపాలెం–మద్దూరు–వణుకూరు రోడ్డు వంటి కీలక రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం

అభివృద్ధి అనేది ఒక్కరోజులో పూర్తయ్యే కార్యక్రమం కాదని,గ్రామాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించి,అందుబాటులో ఉన్న నిధులను సమీకరిస్తూ దశలవారీగా పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే అన్నారు,ప్రతి గ్రామానికి అవసరమైన రహదారులు, డ్రైనేజీలు,కనెక్టివిటీతో పాటు ఇతర మౌలిక వసతులను మెరుగుపరచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

గంగూరు,వణుకూరు,చోడవరం గ్రామాల్లో ప్రారంభించిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో,నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు తెలిపారు, పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,అధికారులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru