Nuzvid: నామినేషన్ ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ అసంతృప్తి!

Nuzvid: నూజివీడు నామినేషన్ ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రిటర్నింగ్ అధికారి రవికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Oct 2026 1:52 PM IST
Nuzvid
X

Nuzvid: నామినేషన్ ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ అసంతృప్తి!

Nuzvid: నూజివీడు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల నిమిత్తం చేసిన ఏర్పాట్ల పై సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.20 ఎంపీటీసీ స్థానాలుండగా కేవలం మూడు కౌంటర్లను అది ఇరుకు గదుల్లో ఏర్పాటు చేయడంపై రిటర్నింగ్ అధికారి రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.11 గంటలకల్లా నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాల్సి ఉండగా 11 గంటల తర్వాత ఏర్పాట్లు చేయడం అని సబ్ కలెక్టర్ ప్రశ్నించారు.నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణమే సరైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్