Nuzvid: 'అర్నాబ్' తుఫాను: నూజివీడు సబ్ కలెక్టర్ హెచ్చరిక!
Nuzvid: 'అర్నాబ్' తుఫాను వేళ నూజివీడులో 35 పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజలు సహకరించాలని సబ్ కలెక్టర్ వినూత్న కోరారు.
Nuzvid: 'అర్నాబ్' తుఫాను: నూజివీడు సబ్ కలెక్టర్ హెచ్చరిక!
Nuzvid: ‘అర్నాబ్’ తుపాను నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు.జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్,ఎస్పీ ఆదేశాలు,మార్గదర్శకత్వంలో డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా పనిచేస్తున్నారని వెల్లడించారు.
అక్టోబర్ 27,28,29 తేదీల్లో తుపాను ప్రభావం ఉండే అవకాశం నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.డివిజన్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 7093703964, 08656232717 నంబర్లను సంప్రదించాలని కోరారు. గ్రామ,మండల స్థాయిలో సచివాలయ సిబ్బంది,వీఆర్వోలు,పంచాయతీ కార్యదర్శులు,తహసీల్దార్లు,ఎంపీడీవోలు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.
తుపాను సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున డివిజన్లో 3,468 బలహీన గృహాలను గుర్తించినట్లు తెలిపారు.ప్రజల రక్షణ కోసం 35 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని,అక్కడ ఆహారం,తాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.
ముఖ్యంగా పెద్దచెరువు,మొగలిచెరువు పరిసరాలు,లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ప్రమాదకర చెట్లు,బలహీన విద్యుత్ స్తంభాలను గుర్తించి సంబంధిత శాఖల ద్వారా చర్యలు చేపడుతున్నామని,75 శాతానికి పైగా నీటిమట్టం ఉన్న 23 చెరువులతో పాటు ఇతర చెరువుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
వైద్య,ఆరోగ్య శాఖల సమన్వయంతో గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని,పశువులకు ప్రాణనష్టం జరగకుండా పశుసంవర్ధక శాఖను కూడా అప్రమత్తం చేశామని అన్నారు.ప్రజల ప్రాణాలను కాపాడటం,పశువుల ప్రాణనష్టాన్ని నివారించడం,ప్రజా ఆస్తులకు నష్టం తగ్గించడం ప్రధాన లక్ష్యమని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్, ఎస్పీ మార్గదర్శకత్వంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని,అధికారులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించినప్పుడు తప్పనిసరిగా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తుపానుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియా సహకరించాలని కోరారు.




