Nandigama: ఇళ్లలో అక్రమ మద్యం నిల్వలు ఉంచితే కఠిన చర్యలు: ఎక్సైజ్ సీఐ!
Nandigama: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ఇళ్లలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచితే కేసులు నమోదు చేస్తామని కంచికచర్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ ఆశ్రపూన్నీసా బేగం హెచ్చరించారు.
Nandigama: ఇళ్లలో అక్రమ మద్యం నిల్వలు ఉంచితే కఠిన చర్యలు: ఎక్సైజ్ సీఐ!
నందిగామ: స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్. కంచికచర్ల పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ ఆశ్రపూన్నీసా బేగం. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఎవరైనా వాళ్ళ యొక్క ఇళ్ళలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు. మద్యం పంపిణీ జరగకుండా చూడాలి. ఎవరికైనా ఏదైనా సమాచారం తెల్సినా కంచికచర్ల ఎక్సైజ్ శాఖ వారికి సమాచారం తెలపండి. ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను. ఒకవేళ ఈ నిబంధనలు అతిక్రమించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ ఆశ్రపూన్నీసా బేగం.




