Nandigama: నందిగామ నియోజకవర్గంలో 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం!

Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని 4 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Naresh, Nandigama
Published on: 25 Nov 2026 10:44 AM IST
Nandigama
X

Nandigama: నందిగామ నియోజకవర్గంలో 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం!

నందిగామ: నందిగామ నియోజకవర్గంలో రెండో ఫేజ్ లో మొత్తం 9 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 4 మండలాల గ్రామ పంచాయతీల్లో కూటమీ అభ్యర్థులకు ప్రజలు జై కొడుతున్నారు, 9 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కంచికచర్ల మండలంలో మొత్తం16 పంచాయతీలకుగా ను 3 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కునికిన పాడు పంచాయతీ సర్పంచ్ గా నడకుదురు కృష్ణకుమారి, ఉపసర్పంచ్ గా కందుల దుర్గాప్రసాద్.

గని ఆత్కూరు పంచాయతీ సర్పంచ్ గా ఉప్పెర్ల అంజనేయులు, ఉపసర్పంచ్ షేక్ జాని. ఎస్ అమరవరం పంచాయతీ సర్పంచ్ గా బండి ఉదయశ్రీ' ఉప సర్పంచ్ గా వసంత మంజుల ఎన్నికయ్యారు. వీరులపాడు మండలంలో 22 పంచాయతీలకు గాను ఒక పంచాయతీ ఏకగ్రీవమైంది. చౌటపల్లి పంచాయతీ సర్పంచ్ గా కొండవీటి అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చందర్లపాడు మండలంలో మొత్తం 18 పంచాయతీలకు గాను 3 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

మేజర్ పంచాయతీ చందర్లపాడు సర్పంచ్ గా మేకల సుదాకర్, ఉప సర్పంచ్ గా లాల్ షా. వెలది కొత్తపాలెం సర్పంచ్ గా తాళ్లపల్లి వెంకట్రావు,ఉపసర్పంచ్ గా ఈదర పిచ్చిబాబు. ఏటూరు సర్పంచ్ గా చలంచర్ల కృష్ణ ప్రసాద్, ఉప సర్పంచ్ గా ఉన్నం తులశమ్మ ఎన్నికయ్యారు. నందిగామ మండలంలో 23 పంచాయతీ లకుగాను 2 పంచాయతీ మాత్రమే ఏకగ్రీవమైంది. లింగాలపాడు సర్పంచ్ గా ఉమ్మ నేని లక్ష్మినాద్. తొర్రగుడిపాడు సర్పంచ్ గా మోర్ల లక్ష్మీ, ఉప సర్పంచ్ గా తానూరి వెంకటనరసమ్మ ఎన్నికయ్యారు.

Naresh, Nandigama

Naresh, Nandigama