Gannavaram: అట్టహాసంగా నున్న సర్పంచ్ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి నామినేషన్!

Gannavaram: ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం నున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున టీడీపీ గ్రామ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2026 12:50 PM IST
Gannavaram
X

Gannavaram: అట్టహాసంగా నున్న సర్పంచ్ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి నామినేషన్!

గన్నవరం: ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం, నున్న గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి నుండి సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు. సుమారు 2 వేల మంది పైగా కూటమి నాయకుడు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాలినడకలు నున్న గ్రామపంచాయతీలో ఆర్ఓ సురేష్ కి నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా టిడిపి సర్పంచ్ అభ్యర్థి కలకోటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాలు దేదీప్యమానముగా వెలుగుతున్నాయి. మా గ్రామంలో త్రాగునీటి సమస్య ఎప్పటినుంచో ఉంది, నేను అధికారంలోకి రాగానే పరిష్కార దిశగా కృషి చేస్తాను.

ప్రజల్లో ఓటమి ప్రభుత్వంపై మంచి స్పందన ఉంది. భారీ మెజార్టీతో సర్పంచ్ గా మా గ్రామ ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ఆధ్వర్యంలో నున్న గ్రామాన్ని అభివృద్ధి దిశగా కృషి చేస్తాను.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్