Nandigama: నందిగామలో నిత్య పెళ్లికొడుకు బాగోతం.. మూడో భార్య ఫిర్యాదు
Nandigama: నందిగామలో ముగ్గురిని పెళ్లాడి మోసగించిన నిత్య పెళ్లికొడుకు షేక్ మహబూబ్ సుభానిపై మూడో భార్య సోమేశ్వరి దేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Nandigama: నందిగామలో నిత్య పెళ్లికొడుకు బాగోతం.. మూడో భార్య ఫిర్యాదు
నందిగామ: నందిగామ పట్టణంలో డివిఆర్ కాలనీకి చెందిన షేక్ మహబూబ్ సుభాని అనే వ్యక్తి దుర్గా నగర్ కి చెందిన తోట సోమేశ్వరి దేవిని 3సం" క్రితం పెళ్లి చేసుకున్నారు.
అయితే కొద్ది రోజులుగా భర్త మహబూబ్ సుభాని ప్రవర్తనలో తేడా గమనించిన భార్య కు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
తన భర్త తన సెల్ ఫోన్ నుంచి 10మంది మహిళలతో అసభ్యకరమైన చాటింగ్లు నీలి చిత్రాల వీడియోలు న్యూ డ్ రీల్స్ పంపించడంతో అది చూసిన భార్య సోమేశ్వర దేవి భర్తను మహబూబ్ సుభాని నిలదీసింది.
దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి భర్త బయటకు వెళ్లి జీవిస్తున్నారు అసలు భర్త పై విచారణ జరిపిన భార్యకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిపారు.
తన భర్తకు తన కన్న ముందే 2 వివాహా లు జరిగాయని తనని 3వ వివాహం చేసుకున్నట్లుగా బయటకు వచ్చింది.
దీంతో భార్య సోమేశ్వరి దేవి భర్త ఉంటున్న ఇంటికి వెళ్లి అడగగా తన కుటుంబ సభ్యులతో తనపై దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది.
మొదటి భార్యని వివాహం చేసుకున్న కొన్ని రోజులకు ఆమెను హత్య చేశాడని తెలిపింది అలాగే 2వ భార్యను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యి ప్రేమ వివాహం చేసుకున్నారని తనని 3వ వివాహం చేసుకొని తన దగ్గర ఉన్న డబ్బు బంగారం తీసుకొని తనని గర్భవతిని చేశాడని భార్య సోమేశ్వరి దేవి.
మోసపోయినట్లుగా విలపిస్తూ నందిగామ పోలీసుల్ని ఆశ్రయించింది పోలీసులు దర్యాప్తు చేపట్టి నిత్య పెళ్లి కొడుకు పై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారని ఇలాంటి మోసగాడి చేతిలో ఏ మహిళ బలి కాకూడదని ఇలాంటి మోసగాడిని చట్టరీత్యా కఠిన శిక్ష విధించాలని తనకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయింది బాధిత మహిళ.




