Nandigama: మున్సిపల్ పోరు వేళ పోలీసుల భారీ కవాతు!

Nandigama: నందిగామ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు.

Naresh, Nandigama
Published on: 26 Oct 2026 7:03 PM IST
Nandigama
X

Nandigama: మున్సిపల్ పోరు వేళ పోలీసుల భారీ కవాతు!

నందిగామ: నందిగామ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు నిర్వహించారు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రజల్లో భరోసా కల్పించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు.

Naresh, Nandigama

Naresh, Nandigama