NTR: నందిగామలో రూ.2.50 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
NTR: నందిగామ మండలం చందాపురం క్రాస్ రోడ్ వద్ద రూ.2.50 కోట్ల ఆర్అండ్‌బీ నిధులతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు.
NTR: నందిగామలో రూ.2.50 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
NTR: నందిగామ మండలం చందాపురం క్రాస్ రోడ్ వద్ద ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రూ.2.50 కోట్ల నిధులతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు...
30 గ్రామాలకు రాకపోకలకు ప్రధాన రహదారి నూతన నిర్మాణానికి శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు... ఈ రహదారి అభివృద్ధి పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ప్రయాణ సమయం,
ఇబ్బందులు తగ్గనున్నాయి.కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీరు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు...
నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తీసుకువచ్చి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు...




