NTR: నందిగామలో నూతన పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య!
NTR: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రూ.19 కోట్ల HAM నిధులతో నూతన పార్క్ నిర్మాణానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు.
NTR: నందిగామలో నూతన పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య!
NTR: నందిగామ పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా మంజూరైన రూ.19 కోట్ల నిధుల్లో భాగంగా 7, 8వ వార్డులకు అనుసంధానంగా గోవర్ధన గార్డెన్స్‌లో నూతన పార్క్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు.
మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు, కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ:
నందిగామ పట్టణాన్ని కేవలం మౌలిక వసతుల పరంగానే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన జీవన వాతావరణం కల్పించేలా సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.నందిగామ పట్టణానికి మంజూరైన రూ.19 కోట్ల HAM నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అందులో భాగంగానే గోవర్ధన గార్డెన్స్ వద్ద నూతన పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు...
పార్క్ నిర్మాణం పూర్తయిన తర్వాత చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువతకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేందుకు చక్కటి వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగామ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ భారీ స్థాయిలో నిధులు తీసుకువచ్చి పనులను కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు. రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక వసతులతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పార్కులు, ఇతర ప్రజా సౌకర్యాల ఏర్పాటుపై కూడా దృష్టి సారిస్తున్నామని అన్నారు.
నందిగామ పట్టణాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి నిధులు తీసుకురావడం, ఆ నిధులను అభివృద్ధి పనులుగా మార్చి ప్రజలకు అందించడం తమ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.నూతన పార్క్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు...




