Tiruvuru: తిరువూరులో "ప్రజల కోసం వైఎస్సార్ సీపీ" రెండో రోజు ప్రచారం!
Tiruvuru: తిరువూరులో "ప్రజల కోసం వైఎస్సార్ సీపీ" కార్యక్రమం. సూపర్-6 హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని నల్లగట్ల స్వామిదాస్ విమర్శలు.
Tiruvuru: తిరువూరులో "ప్రజల కోసం వైఎస్సార్ సీపీ" రెండో రోజు ప్రచారం!
Tiruvuru: తిరువూరు 22వ వార్డులో "ప్రజల కోసం వైఎస్ఆర్ సీపీ" రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్. తంగళ్ళబీడులో వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న స్వామిదాస్. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ.
వైఎస్సార్‌సీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన నాయకులు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని స్వామిదాస్ తీవ్ర విమర్శలు. సూపర్-6 పథకాల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపాటు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని స్వామిదాస్ ఆరోపణ. సూపర్-6 హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడమే కూటమి ప్రభుత్వ విధానమని విమర్శ. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన స్వామిదాస్. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చైర్మన్ స్థానం గెలుపే లక్ష్యంగా పనిచేయాలి- ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్.




