Musunuru: ముసునూరులో నామినేషన్ల వేళ ర్యాలీలపై నిషేధం!

Musunuru: ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా డిఎస్పి పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Oct 2026 2:03 PM IST
Musunuru
X

Musunuru: ముసునూరులో నామినేషన్ల వేళ ర్యాలీలపై నిషేధం!

Musunuru: నూజివీడు నియోజకవర్గం లోని ముసునూరు మండలంలో నేటి నుండి జరగనున్న మండల పరిషత్ జిల్లా పరిషత్ నామినేషన్లను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు డిఎస్పి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ల స్వీయ పర్యవేక్షణలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామని ముసునూరి ఎస్సై చిరంజీవి తెలిపారు.

నామినేషన్ కార్యాలయానికి 100 మీటర్ల సరౌండింగ్ లో ఎటువంటి వాహనాలు గాని నామినేషన్ కార్యాలయ పరిసరాలలో నినాదాలు చేయటం గాని ర్యాలీలు చేయటం గాని నిషేధించినట్టు ఎస్సై తెలిపారు.

నామినేషన్ అభ్యర్థితో పాటు మరొక ఇద్దరు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు,నామినేషన్ల సందర్భంగా ఏ విధమైన అల్లర్లు జరిగిన ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్